Newsభ‌గ‌వంత్ కేస‌రి బ్లాక్‌బ‌స్ట‌ర్‌... ఆ సెంటిమెంట్ గుండెల్ని పిండేస్తుందా.. ( వీడియో)

భ‌గ‌వంత్ కేస‌రి బ్లాక్‌బ‌స్ట‌ర్‌… ఆ సెంటిమెంట్ గుండెల్ని పిండేస్తుందా.. ( వీడియో)

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల కీలక మైన పాత్రలో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి..అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటు బాలయ్య అఖండ ,వీర సింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో భగవత్ కేసరి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికె ఏరియాల వారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు చూస్తుంటే బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భగవత్ కేసరి సినిమా నుంచి రిలీజ్ అయిన పాస్టర్స్ ,పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ రిలీజ్ చేశారు.

ఇందులో బాలయ్య , శ్రీలీల చాలా ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. బాలయ్య చాలా యంగ్ లుక్ లో కనిపించగా.. శ్రీలీల కూడా చిన్న పిల్లలాగా స్కూల్ యూనిఫాంలో చక్కగా కనిపించారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో తండ్రి కూతుర్ల మధ్య వచ్చే సెంటిమెంట్ ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయట‌.. ఈ సీన్లు అన్ని మహిళా ప్రేక్షకులను ఫ్యామిలీ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఈ సెంటిమెంట్ గుండెలను పిండేసేలా ఉంటుందని సినిమా బ్లాక్ బస్టర్ అవటంలో ఈ పార్ట్ అంతా కీలకంగా ఉంటుందని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఇండస్ట్రీలో భగవంత కేసరికి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాను రేపటి రోజున థియేటర్లలో చూడటం ఒక్కటే మిగిలి ఉంది అభిమానులకు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news