నిజంగానే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తేనే ఏడాది పొడవునా సంబరాలు చేసుకుంటారు. అలాంటిది ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులోను రెండు పాన్ ఇండియా సినిమాలు అయితే ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి బ్రేకులు వేసే వాళ్ళు ఎవరు ఉంటారు. గత పది ఏళ్లలో ఎన్టీఆర్ సినిమాల విషయంలో వరుస విజయాలు సాధిస్తున్న అభిమానులను మాత్రం ఒక విషయంలో బాగా నిరాశ పరుస్తున్నారు.
ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. ఒక 2015లో మాత్రం నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. గత కొన్నేళ్లలో ఎన్టీఆర్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు సినిమాలు చేయటం.. ఆ రెండు సూపర్ హిట్ అవడం ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడా లేని ఆనందాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చాడు. ఇక 2018 చివర్లో అరవింద సమేత సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్లు టైం కేటాయించాల్సి వచ్చింది.
ఇది పాన్ ఇండియా మల్టీ స్టార్లర్ కావడంతో పాటు మధ్యలో రెండు మూడుసార్లు కరోనా రావడంతో ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు 2024 లో ఎన్టీఆర్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడు. 2017 తర్వాత వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆ తర్వాత హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా వచ్చే యేడాది రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ వార్ 2 కాస్త లేట్ అయినా దేవర 2 వచ్చే యేడాది చివరలో రిలీజ్ కానుందని సమాచారం. దేవర సినిమాను రెండు పార్టీలుగా రిలీజ్ చేస్తున్నట్టు కొరటాల తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా వచ్చే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఏడాది పొడవు నా ఎన్టీఆర్ అభిమానులకు జాతర మామూలుగా ఉండదు.