Newsరానా ప్రేమాయ‌ణం న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ ఇదే..!

రానా ప్రేమాయ‌ణం న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుపాటి రానా సినిమాలకంటే కూడా వ్యక్తిగత జీవితంలో బాగా పాపులర్ అయ్యారు. బాహుబలి సిరీస్ సినిమాలతో రానా పాన్ ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యారు. అయితే రానాకు సోలోగా చెప్పుకోదగ్గ హిట్ సినిమా అయితే లేదు. అయితే రానాలో మంచి నటుడు ఉన్న మాట వాస్తవం. అంత స్టార్ హీరో కాకపోయినా రానా స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపి బాగా వార్తల్లో నిలిచారు. రానా ప్రేమాయ‌ణాలు నడిపిన హీరోయిన్ల లిస్టులో చెన్నై చిన్నది త్రిష, నయనతార, బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు, కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇలా చాలా పేర్లు వినిపించాయి.

రానా – త్రిష‌ గురించి చెప్పక్కర్లేదు .వీరిద్దరూ ఎన్నోసార్లు కలిసి మీడియా కెమెరాలు చిక్కారు. హైదరాబాదులో ఒకసారి మత్తు ఎక్కువ అయ్యో లేదా మరో కారణమో కానీ… తూలిపోతూ కారు దగ్గరికి వ

చ్చి కెమెరాలకు చిక్కటం.. ఆ వీడియోలు వైరల్ కావటం జరిగిన సంగతి తెలిసిందే. రానా – త్రిష పెళ్లి చేసుకుంటారు అనేంతవరకు వెళ్లిపోయింది. అయితే త్రిష‌ను పెళ్లి చేసుకోవడం సురేష్ బాబుకు.. రానా కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా రానా మనసు ఏదోలా మార్చారు.

ఇక కృష్ణం వందే జగద్గురుం సినిమా టైంలో నయనతారతోను రానా ప్రేమాయ‌ణం న‌డిపాడంటారు. ఇక కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదితో కూడా రానా చాలా సన్నిహితంగా క్లోజ్ గా ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక బాలీవుడ్‌లో ద‌మ్‌మారో ద‌మ్ సినిమా షూటింగ్ టైంలో రానా – బిపాసాబసు చాలా రోజులపాటు కలిసి హైదరాబాదులోనే ఉన్నారు.

వీరిద్దరూ కలిసి ఒకే రూములో చాలా రోజులు ఉన్నారని.. ఆ టైంలో వీరిద్దరి మధ్య ఘాటు ఎ..ఫైర్ నడిచింది అన్న ప్రచారం గట్టిగా జరిగింది. రానా – బిపాసాబసును తన కారులోనే తిప్పుతూ తన ఆస్తులు అన్ని చూపించడంతో.. ఆమె ఏదో రానాను బుట్టలో వేసుకుని దగ్గుపాటి ఇంటి కోడలు అవడంతో పాటు ఆ కోట్ల ఆస్తికి కోడలు అయిపోవాలన్న ట్రై చేసిందన్న ప్రచారం కూడా నడిచింది. ఏది ఏమైనా హీరోయిన్లతో రానా వ్యవహారాలు వర్కౌట్ కాలేదు. చివరకు ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్‌ను రానా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news