టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా టాలీవుడ్ యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వీరిద్దరు మహేష్ తో తొలిసారిగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. అటు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఖలేజా తర్వాత 13 సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తీసుకుని గుంటూరు కారం సినిమా వస్తోంది. సినిమాలపై అంచనాలు మామూలుగా లేవు.
ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ స్టిల్స్ కచ్చితంగా సినిమా సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న ధీమాతో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సినిమా రిలీజ్ ఒకరోజు ముందుకు ఫ్రీ ఫోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలలో చర్చి జరుగుతుంది. ఈ సినిమాపై ఉన్న హైప్‌తో రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
లేటెస్ట్ గా గుంటూరు కారం నైజాం బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం చాలామంది పోటీపడినా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏకంగా రు. 45 కోట్లు చెల్లించి నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా అలవైకుంఠపురంలో నైజాంలో లాంగ్ రన్ లో 43 నుంచి 44 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టింది. అంటే గుంటూరు కారం సినిమా అలవైకుంఠపురంలో సినిమాకు మించిన రేంజ్ లో సూపర్ హిట్ అవ్వాలి. అలా అయితేనే దిల్ రాజు సేఫ్ అవుతాడు.
అయితే ఈ రు. 45 కోట్ల మొత్తం నాన్ రికవరీ అడ్వాన్స్ లేదా కొంత నాన్ రికవరీ, కొంత రివకరీ అడ్వాన్స్‌గా బిజినెస్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మహేష్ బాబు మీద ఉన్న క్రేజ్, నమ్మకంతో దిల్ రాజు ఏకంగా 45 కోట్లు పెట్టి నైజాం రైట్స్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పైగా సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు మరో నాలుగు ఐదు క్రేజీ ప్రాజెక్టులు కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంత గట్టి పోటీ మధ్యలో 45 కోట్లు బిజినెస్ అంటే గుంటూరు కారం క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.