Newsఅశ్వినీద‌త్ - చిరంజీవి కాంబినేష‌న్ ఫిక్స్‌... డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే కేకే...

అశ్వినీద‌త్ – చిరంజీవి కాంబినేష‌న్ ఫిక్స్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే కేకే కేక‌బ్బా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదికి ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవడంతో పాటు చిరు రీఎంట్రీ ఇచ్చాక తీసిన సినిమాలలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక తాజాగా ఆగస్టు నెలలో భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరా పరాభవాన్ని చూశారు. ప్రస్తుతం రీమిక్స్ వర్కౌట్ కాకపోవడంతో చిరంజీవి వరుసగా డైరెక్ట్ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత నిర్మాతగా.. కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో బింబిసారా దర్శకుడు వశిష్ట తెర‌కెక్కించే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రెండు సినిమాలు లాక్ చేసిన చిరంజీవి మరో సెన్షేష‌న‌ల్‌ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో తనకు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన బ్యానర్ లో చిరంజీవి నటిస్తున్నారు.

ఆ బ్యానర్ ఏదో కాదు వైజయంతి మూవీస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి – చూడాలని ఉంది – ఇంద్ర సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చివరగా ఈ బ్యానర్లో చిరంజీవి జై చిరంజీవ సినిమాలో నటించారు. చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి అశ్వినీద‌త్‌ చిరంజీవితో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎట్టకేలకు ఇప్పుడు చిరు – అశ్వినీదత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఖరారు కాకపోయినా మహానటి – కల్కి సినిమాలతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని.. సినిమా కథ‌ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏది ఏమైనా వైజయంతి మూవీస్ బ్యానర్ లో చిరంజీవి నటించడం అయితే కన్ఫర్మ్ అయినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news