తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన శ్రీకాంత్ సినిమాల్లో రాణించాలన్న కోరికతో చెన్నై వెళ్లి కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించారు. వెంకటేష్ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అబ్బాయిగారు సినిమాలోని వెంకటేష్ తమ్ముడుగా నెగటివ్ పాత్రలో నటించారు. ఆ తర్వాత హీరో అయిన శ్రీకాంత్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం సీనియర్ హీరో అయినా ఇటు నెగిటివ్ పాత్రలతో పాటు అటు స్టార్ హీరోల సినిమాలలో సపోర్టింగ్ పాత్రలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. శ్రీకాంత్ తనతో పాటు ఎన్నో సినిమాలలో కలిసి హీరోయిన్గా నటించిన ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ కూడా పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టారు.
ఇక ఊహతో పెళ్లి కంటే ముందే శ్రీకాంత్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అన్న పుకార్లు అప్పట్లో వినిపించాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? సంఘవి. కన్నడ కస్తూరి అయిన సంఘవి- శ్రీకాంత్ కాంబినేషన్లో అప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. హీరోయిన్గా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసింది సంఘవి. శ్రీకాంత్తో కలిసి మాణిక్యం, ప్రేయసి రావే వంటి సినిమాల్లో నటించింది. ఇక పిల్ల నచ్చింది.. సినిమా టైంలో ఏదో నడుస్తుంది అన్న పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లను శ్రీకాంత్ కొట్టి పారేశాడు. ఆ తర్వాత ఊహను పెళ్లి చేసుకొని తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టాడు.