Moviesచిరంజీవి-సురేఖ గొడవ పడితే వెంటనే అలా చేస్తారా..? హౌ రొమాంటిక్..!!

చిరంజీవి-సురేఖ గొడవ పడితే వెంటనే అలా చేస్తారా..? హౌ రొమాంటిక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే చిరంజీవి సురేఖ ల పేర్లు చెప్తే వచ్చే ఫీలింగ్ వేరేగా ఉంటుంది . మరీ ముఖ్యంగా చిరంజీవి సురేఖల జంట అందరికీ ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంటుంది . కాగా ఎప్పుడూ వీళ్ళిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉంటారా..? వీళ్ళకి అసలు బాధలు ఉండవా ..?వీళ్ళ కొట్లాడుకోరా..? గొడవలు రావా..? అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అఫ్గోర్స్ భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా గొడవలు చికాకులు తగాదాలు వస్తూనే ఉంటాయి . కానీ ఒకరు కోప్పడినప్పుడు మరొకరు కూల్ గా సర్దుకుపోతే అన్ని ప్రాబ్లమ్స్ అక్కడితోనే సర్దుకుపోతాయి. అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు చిరంజీవి సురేఖ. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చిరంజీవి. తామిద్దరం గొడవ పడినప్పుడు తనకంటే ముందు గానే ..సురేఖ కూల్ అయిపోతుందని .. కొన్నిసార్లు సురేఖ కోపడినప్పుడు నేనే కూల్ అయిపోతానని ..అలా మా ఇద్దరు సంసార జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పుకొచ్చాడు.

కానీ సురేఖకు కోపం రావడం చాలా చాలా తక్కువ అని.. ఎప్పుడైనా సరే మాకు గొడవలు అంటూ వస్తే అది పిల్లల విషయంలోనేనని.. కెరియర్ – చదువు – గారాబం కారణంగానే మా మధ్య గొడవలు వస్తూ ఉంటాయని .. కానీ అవి సురేఖ కూల్ చేసేస్తుందని ఎక్కడిది అక్కడే మర్చిపోతుందని అదే ఆమెలోనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటూ చెప్పుకు వచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news