నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హ్యాట్రిక్ సినిమా భగవంత్ కేసరి. ఆఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య వరుసగా మూడో విజయం అందురకున్నాడు. రెండున్నర దశాబ్దాల తర్వాత బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్న బాలయ్య తర్వాత ప్రాజెక్టుపై.. ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది.
అసలు ఇలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందా ? అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఈ న్యూస్ ఉంది. బాలయ్య 110 సినిమా డైరెక్టర్ ఎవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన ముద్ర వేసిన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అని తెలుస్తుంది. ఇప్పుడు సుకుమార్ బాలయ్యతో పనిచేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుండి స్ట్రాంగ్ న్యూస్ బయటికి వచ్చేసింది.
అస్సలు ఏమాత్రం ఊహించని ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని.. దీనిపై త్వరలోనే అధికారికి ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. గతంలో సుకుమార్ నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. బాలయ్య కెరీర్ లో 110వ సినిమాగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాపై వర్క్ ప్రారంభిస్తారని.. పాన్ ఇండియా రేంజ్ లో పరమా ఊర మాస్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా బాలయ్య – సుకుమార్ కాంబినేషన్ అంటే ఊహకే అందని అంచనాలు ఉన్నాయి. ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో కాలమే నిర్ణయించాలి.