Newsఆ హీరోపై కోపంతోనే నాగార్జున‌ను హీరోను చేసిన ఏఎన్నార్‌... అస‌లేం జ‌రిగింది..!

ఆ హీరోపై కోపంతోనే నాగార్జున‌ను హీరోను చేసిన ఏఎన్నార్‌… అస‌లేం జ‌రిగింది..!

టాలీవుడ్ లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఆ కుటుంబం నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరిగిలేని హీరోగా కొనసాగుతున్నాడు కింగ్ నాగార్జున. తండ్రి ఏఎన్ఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చారు నాగార్జున. ఏఎన్ఆర్ ఫ్యామిలీ టాలీవుడ్ లో దాదాపు 7 దశాబ్దాలుగా కొనసాగుతుంది.

ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులుగా నాగార్జున ఇద్దరు వార‌సులు నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి ఏఎన్ఆర్ చివరి సినిమా మనంలో నటించారు. ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జునను హీరోగా పరిచయం చేయాలని అనుకోలేదట. నాగార్జున అమెరికాలో ఎంఎస్ చేశారు. ఇండియాకు తిరిగి వచ్చాక ఆయనను బిజినెస్ వైపు మళ్ళించాలని ఏఎన్ఆర్ అనుకున్నారు.

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా.. నాగేశ్వరరావు నిర్మాతగా ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమాలో కృష్ణ నటిస్తానని ముందుగా హామీ ఇచ్చారు. అయితే ఆ టైంలో కృష్ణ ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ బ్యానర్లో చేయాల్సిన సినిమాను మరుస‌టి యేడాది చేస్తానని పెండింగ్ పెట్టారట. ఏఎన్ఆర్ కు కోపం రావడంతో వెంటనే నాగార్జునను హీరోని చేయాలని అనుకున్నారు.

విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో విక్రమ్ సినిమాతో నాగార్జునను హీరోని చేసేసారు. ఆ సినిమా హిట్ అయ్యాక వరుసగా నాగార్జున సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని అనుకున్న నాగార్జున సినిమాలపై ఆసక్తి పెంచుకుని స్టార్ హీరో అయ్యారు. అక్కడ నుంచి ఆయన వెనుక తిరిగి చూసుకోలేదు. అలా కృష్ణ ఏఎన్ఆర్ కి చేయాల్సిన సినిమా వాయిదా వేయడంతో వెంటనే తన కొడుకుని హీరోని చేసి అనుకోకుండా స్టార్‌ హీరోని చేసి సక్సెస్ అయ్యారు ఏఎన్ఆర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news