Moviesవామ్మో..నవీన్ చంద్ర ఆ మాట అనగానే ఏడ్చేసిన కలర్స్ స్వాతి ..ఇంత...

వామ్మో..నవీన్ చంద్ర ఆ మాట అనగానే ఏడ్చేసిన కలర్స్ స్వాతి ..ఇంత ఎమోషనల్ ఫెలోనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా ఆమె డివోర్స్ తీసుకోబోతుంది అని ..డివర్స్ తీసుకొని హీరో నవీన్ చంద్ర ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ హద్దులు మీరి పోయిన రేంజ్ లో రూమర్స్ క్రియేట్ అయ్యాయి .

కాగా ఇలాంటి క్రమంలోనే మంత్ ఆఫ్ మధు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆమె స్టేజిపై ఏడ్చేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . నవీన్ చంద్ర – కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మంత్ ఆఫ్ మధు . ఈ సినిమా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది . గతంలో వీళ్ళిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. ఆ తర్వాత వీళ్ళపై ఎన్ని రూమర్స్ వచ్చాయో మనం విన్నిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో వీళ్ళు చక్కగా కలిసి పాల్గొన్నారు .

ఈ క్రమంలోనే స్టేజిపై నవీన్ చంద్ర మాట్లాడుతూ ..కలర్స్ స్వాతి ను ఓ రేంజ్ లో పొగిడేసారు. ” ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి .. మా సిస్టర్ జాబ్ చేస్తూ ఉంటారు .. తను బస్సు, ఆటో , మెట్రోలో రోజు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తను మా కుటుంబం కోసం చాలా కష్టపడింది అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ పర్సన్ ..తనను మా ఫ్యామిలీ మెంబర్ గానే చూస్తున్నాను .. తను కష్టపడడమే కాకుండా తనతో పని చేసే వారిలో కూడా నమ్మకం కలిగిస్తుంది. తనతో లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి అనుకుంటున్నాను .. భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం ..అసలు మిస్ చేసుకోము.. ఆ దేవుడిని ఇంతకంటే నేను ఏమీ అడగను.. అడగలేను “అంటూ చాలా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు . ఆ మాటలకు స్టేజ్ పై కలర్స్ స్వాతి కూడా ఎమోషనల్ గా ఫీల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది . ప్రెసెంట్ ఇవే విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news