News' గుంటూరు కారం ' ఇంట‌ర్వెల్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌... '...

‘ గుంటూరు కారం ‘ ఇంట‌ర్వెల్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌… ‘ ఒక్క‌డు ‘ స్టైల్లో ట్విస్ట్‌…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఖలేజా సినిమా తర్వాత 13 ఏళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని మహేష్.. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కోసం జోడి కట్టారు. ఈ సినిమా ఇంట‌ర్వెల్‌బ్యాంగ్‌పై క్రేజీ గ్యాసిప్‌ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ సారథి స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుగుతోంది అని.. అందుకే ఈ సీక్వెన్స్ త్రివిక్రమ్ భారీగా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల‌ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజ హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మీనాక్షి చౌదరి మీద వచ్చే ట్విస్ట్ అదిరిపోతుందని.. సెకండాఫ్ మొత్తం గుంటూరు మిర్చి యార్డ్ తో పాటు మీనాక్షి చౌదరి పాత్ర చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కడు స్టైల్ లో గుంటూరు కారం సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది.

ఒక్కడు సినిమాలో హీరోయిన్ కోసం హీరో అన్ని వదిలేసి ఆమెతో ట్రావెల్ అవుతాడు. ఆమె లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటాడు. గుంటూరు కారం సినిమాలోని మీనాక్షి చౌదరి పాత్ర కోసం మహేష్ అన్ని వదిలేసి ఆమె ఇబ్బందులను క్లియర్ చేసేందుకు ఎంతకైనా తెగించి ముందుకు సాగుతాడ‌ట‌. అదే టైంలో గుంటూరు మార్చి యార్డ్ స్టోరీ కూడా స‌మాంత‌రంగా న‌డుస్తోంద‌ట‌.

మహేష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడేలా త్రివిక్రమ్ ఈ కథని ప్లాన్ చేశాడని చెబుతున్నారు. గుంటూరు కారం సినిమాలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాష‌ల్లో చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news