బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది. ఆప్ నేత ఆ పార్టీ ఎంపీ రాఘవ చద్దా ఈమె మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా స్వీకరించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఈరోజు ఉదయపూర్ లో లీలా ప్యాలెస్ లో జరిగిన వేడుకలో వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అయితే వివాహ వేడుకకు సంబంధించి ఫోటోలు బయటకు రాకుండా ఈ జంట కట్టుదట్టమైన ఏర్పాట్లు చేసింది.
పెళ్లికి వచ్చిన వారి ఫోన్ లకు బ్లూ కలర్ టేపులు వేసింది. అయినప్పటికీ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. రెండు రోజులపాటు పరిణితి – రాఘవ్ వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే సానియా మీర్జా – హర్భజన్ సింగ్ లాంటి సెలబ్రిటీలు కూడా వచ్చారు. పరిణితి చోప్రా అక్క ప్రియాంక చోప్రా మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేకపోయింది.
ఇక వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా ఒకరికి ఒకరు పరిచయం. లండన్లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇక వీరి వివాహం జరిగిన లీలా ప్యాలెస్ లో విఐపిల కోసం అధునాతన సౌకర్యాలతో సెవెన్ స్టార్ హోటల్ లను బుక్ చేసి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. సిటీలోని లీలా ప్యాలెస్ – తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను బుక్ చేసుకున్నారు.
వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లో అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దే రోజుకు ఏకంగా 10 లక్షల రూపాయలు అట. అంటే కేవలం ఒక్క లగ్జరీ సూట్‌కు పది లక్షల రూపాయలు అంటే ఓవరాల్ గా పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుస్తోంది.