టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు గా ఉన్న బోయపాటి శ్రీను – కొరటాల శివ ఇద్దరు బంధువులు. వీరిద్దరూ పోసాని కృష్ణ మురళి దగ్గర శిష్యరికం చేసినవారే. బోయపాటి శ్రీను 2005లో రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఇక కొరటాల శివ 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో హీరో అయ్యారు. ఇద్దరు విజయవంతమైన దర్శకులు. ఇద్దరు స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. కారణం ఏదైనా ఇద్దరి మధ్య సఖ్యత లేదు.
ఒకప్పుడు కొరటాల బోయపాటి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. అయితే తనకు రావలసిన క్రెడిట్ రాలేదన్న కోపంతోనో.. మరో కారణంతోనో కొరటాల కూడా మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యారు. వరుసగా మిర్చి – శ్రీమంతుడు – భరత్ అనే నేను – జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో అపజయం లేని డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటు బోయపాటి కూడా తాను నమ్ముకున్న మాస్ కథలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. మధ్యలో దమ్ము లాంటి సినిమా వచ్చిన ఆ సినిమా పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి.
రామ్‌చరణ్‌తో చేసిన వినయ విధేయ రామ కూడా ప్లాప్ అయినా మాస్ ప్రేక్షకులను మెప్పించింది. వసూళ్లపరంగా దుమ్మురేపింది. ఆచార్య సినిమాకు ముందు వరకు బోయపాటి పై కొరటాల పై చేయి సాధించారు. ఎప్పుడు అయితే ఆచార్య అతిపెద్ద డిజాస్టర్ అయిందో కొరటాల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. చిరంజీవి – రామ్ చరణ్ – పూజ హెగ్డే లాంటి భారీ తారాగణాన్ని పెట్టుకుని కూడా కొరటాల అంత ఘోరమైన సినిమా తీస్తాడని ఎవరు ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే వినయ విధేయ రామ కంటే కూడా గోరాతి ఘోరమైన ప్లాప్ సినిమా అయ్యింది.
ఆచార్య సినిమా తర్వాత అసలు కొరటాలతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వెనుకడుగు వేశారు. కొరటాల పరువు మొత్తం పోయింది. అయితే ఎన్టీఆర్ అంతకుముందు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పోరాటాలతో దేవర చేస్తున్నారు. ఇక బోయపాటి బాలయ్యతో అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో ఇది మూడో సూపర్ డూపర్ హిట్. అఖండలో బాలయ్య క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరుకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. బోయపాటి మాస్ సినిమాలే కాకుండా వైవిధ్యమైన కథలతో కూడా సినిమాలు తీసి హిట్టు కొడతానని అఖండతో ఫ్రూవ్ చేసుకున్నాడు.
ఇక తాజాగా అఖండ తర్వాత బోయపాటి చేసిన స్కంద ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చేసింది. స్కంధలో మొదటి భాగంలో కంటే సెకండాఫ్‌లో మంచి కథ ఉంది. ఊహించినట్లుగానే, ఈ సినిమా పూర్తిగా యాక్షన్ బ్లాక్స్ మరియు హీరోయిజం ఎలివేషన్‌తో అదిరిపోయిందని అంటున్నారు. ఓవరాల్‌గా బోయపాటి అఖండ, స్కందతో రెండు వరుస సూపర్‌హిట్లు కొట్టేశారు. ఇక ఇప్పుడు దేవరతో ఫ్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొరటాల మీదే ఉంది.