హీరోలకు సినిమా రంగంలో చాలా ఏళ్ల పాటు లైఫ్ స్పాన్ ఉంటుంది. 20 – 30 – 40 సంవత్సరాలు పాటు హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంటారు. అయితే హీరోయిన్లకు పరిస్థితి అలా ఉండదు. ఎంత గొప్ప హీరోయిన్ అయినా ఐదారు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి లేదు. నయనతార లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే 15 సంవత్సరాల పాటు కెరీర్ ఉంటుంది. ఇక చాలామంది తొలినాళ్లలో హీరోయిన్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఆ తర్వాత తల్లిగా, వదినగా, అత్త పాత్రలు కూడా వేస్తూ ఉంటారు.
ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఇది కామన్ గా నడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి జోడిగా హీరోయిన్గా స్టెప్పులు వేసి ఒక వెలుగు వెలిగిన ఒక హీరోయిన్ తర్వాత అదే చిరంజీవికి చెల్లి, అమ్మగా నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? సీనియర్ నటి సుజాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టిన సుజాత 300 పైగా సినిమాల్లో నటించారు.
1980 కృష్ణంరాజు – చిరంజీవి కాంబినేషన్లో ప్రేమతరంగాలు అనే మల్టీస్టారర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది సుజాత. రెండేళ్ల తర్వాత 1982లో సీతాదేవి సినిమాలో చిరుకు చెల్లిగా నటించింది.. ప్రేయసి కాస్త చెల్లెలు అయిపోయింది ఏంటి అనుకుంటున్న టైంలో 1995లో వచ్చిన బిగ్ బాస్ సినిమాలో అదే చిరంజీవికి తల్లిగా కనిపించింది.
చిరుకు చెల్లిగా నటించి రొమాంటిక్ స్టెప్పులేసిన వారు ఉన్నారు.. కానీ ఇలా హీరోయిన్గా చెల్లి, అమ్మ అనేక రకాల పాత్రలు పోషించిన ఏకైక నటి సుజాత కావటం విశేషం. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె 2011 ఏప్రిల్ 6న మృతి చెందారు. ఇక ప్రేమతరంగాలు సినిమాలో డాన్సర్ గా నటించిన జయసుధ.. రిక్షావోడు సినిమాలో చిరంజీవికి తల్లిగా కూడా నటించారు.