News25 ఏళ్ల క్రిత‌మే చిరంజీవి పాన్ ఇండియా సినిమా... ఎవ‌రు ఆపేశారు......

25 ఏళ్ల క్రిత‌మే చిరంజీవి పాన్ ఇండియా సినిమా… ఎవ‌రు ఆపేశారు… ఏం జ‌రిగింది..!

ఇప్పుడు అందరూ కొత్తగా పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. ఒక భాషలో తెరకెక్కించిన సినిమాలు మూడు, నాలుగు భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా అని డబ్బాలు కొట్టుకుంటున్నారు బాహుబలి లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆమోదం పొందడంతో పాటు ఇండియా అనే పదానికి విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. అయితే రెండున్నర దశాబ్దాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని ఎన్నో కష్టాలు పడ్డారు.

ఆ సినిమా పేరు అబూ పూర్తి పేరు అబూ బాగ్దాద్‌ గజదొంగ. అయితే ఈ సినిమా చాలావరకు షూటింగ్ కూడా జరుపుకుంది. దాంట్లో కొన్ని సీన్లు ముస్లింలను అవమానించే విధంగా ఉన్నాయంటూ వాళ్ళు ఆ సినిమా మీద కేసు వేశారు. దీంతో సినిమా చిక్కుల్లో పడింది. అప్పటికే చాలా ఖర్చుపెట్టిన నిర్మాత ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేయలేక మధ్యలో వదిలివేశారు. అలా చిరంజీవి చేయాల్సిన ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆగిపోయింది.. లేకపోతే చిరంజీవి ఎప్పుడో పాన్ ఇండియా హీరోగా ఎదిగేవారు.

ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎదగడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక చిరంజీవి నటించిన అబు బాగ్దాద్ గజదొంగ పాండ్ ఇండియా సినిమాకు భాషా లాంటి సినిమాతో ఇండియాలోనే తిరిగి లేని స్టార్ డ‌మ్‌ సొంతం చేసుకున్న సురేష్ కృష్ణ డైరెక్టర్ కావడం విశేషం. అప్పట్లో క్రేజీ హీరోయిన్లుగా ఉన్న టబు, ఊర్మిల మండోత్క‌ర్ చిరంజీవికి జోడిగా హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

ఆ సినిమా ఆరోజు కంప్లీట్ అయ్యి ఇండియా వైడ్ గా రిలీజ్ అయి ఉంటే చిరంజీవి క్రేజ్ ఆ రోజుల్లోనే నేషనల్ లెవెల్ లో మారుమోగిపోయి ఉండేది. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్ర‌స్తుతం కురసాల కళ్యాణ్ కృష్ణ – మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రెండు సినిమాలలో నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news