Newsప్ర‌భాస్ దెబ్బ‌తో మ‌హేష్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌...!

ప్ర‌భాస్ దెబ్బ‌తో మ‌హేష్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌…!

ఏది ఏమైనా టాలీవుడ్ ఇప్పుడు టెన్షన్ లో పడిపోయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ఈనెల 28న థియేటర్లలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే త‌రువాయి. వచ్చే సంక్రాంతి కానుక‌గా స‌లార్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు సలార్‌ సినిమాపై దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులలో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు.

ఈ సినిమా సోలోగా వస్తే కనీసం ఎదురు వెళ్లేందుకు కూడా బాలీవుడ్ సినిమాలు కూడా భయపడుతున్నాయి. అలాంటిది స‌లార్‌ సెప్టెంబర్ నుంచి వాయిదా పడి సంక్రాంతికి వెళ్లిపోతే సంక్రాంతి రేసులో ఉన్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాల్సిందే. ఇప్పటికే మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమాను వచ్చే సంక్రాంతి కానుక జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా కూడా సంక్రాంతి వస్తే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ గుంటూరు కారం సినిమాపై ఉంటుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ టైంలో సలార్‌కు ఎదురు వెళ్లడం అంటే అది మామూలు రిస్కు కాదనే టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అలాగే గుంటూరు కారం సినిమాకు థియేటర్ల సమస్య కూడా ఏర్పడుతుందని అంటున్నారు. మరి దీనిపై గుంటూరు కారం నిర్మాతలు వెనక్కి తగ్గుతారా ? లేదా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news