Newsర‌వితేజ కూతురు పేరు తెలుసా... హీరోయిన్ల‌ను మించిన అందం..!

ర‌వితేజ కూతురు పేరు తెలుసా… హీరోయిన్ల‌ను మించిన అందం..!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇక సంక్రాంతికి ఈగిల్ సినిమాతో స్వల్ప వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి థియేటర్లలోకి దిగనున్నాడు. వీటిలో యువ దర్శకుడు వంశీ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలవుతుంది.

ఇక కార్తీక్ ఘట్టమ‌నేని తర్కెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్ మూవీ 2024 సంక్రాంతి రేసులో ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్లలో రవితేజ బిజీబిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే ఈగిల్ సినిమా షూటింగ్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి టోక్యో వెళ్లిన మాస్ మహారాజా రవితేజ అక్కడ వారితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.

కొద్దిసేపటి క్రితం రవితేజ తన సతీమణి కళ్యాణి – కూతురు మోక్షద – కుమారుడు మహదన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ రెండు ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ర‌వితేజ కూతురు మోక్ష‌ద అయితే మోకాళ్ల‌కు పైనే స్క‌ర్ట్ వేసి హీరోయిన్ల‌ను మించిన అందంతో స్మైల్ ఇస్తోంది.

ఇక సినిమాలో షూటింగ్లో గ్యాప్ వస్తే రవితేజ ఎక్కువగా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు నాలుగు సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news