హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్ గా జరుగుతూ ఉంటుంది. స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారి కెరీర్.. వారి ప్రేమ అనేది విడదీసి చూడలేము. కొంతమంది అవసరాల కోసం ప్రేమలో పడుతూ ఉంటారు. ఇక ప్రేమ విషయానికొస్తే కొంత మంది ప్రేమిస్తున్నామని పైకి చెబుతారు.. మరికొందరు హీరోయిన్లు సైలెంట్ గా సీక్రెట్ గా, ప్రేమలు.. డేటింగ్ లు కానీ చేస్తూ ఉంటారు. ప్రేమలో పండితే ఓకే.. లేదంటే మరో ప్రేమికుడు ఇలా సాగుతుంది మన సినిమా వాళ్ళ వ్యవహారం.
అయితే టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ శ్రీలీల.. తాను ఈ ప్రేమ ప్రహసనంలోకి ఇంకా ఎంటర్ కాలేదని చెబుతోంది. రామ్ హీరోగా తెరకెక్కిన స్కంద సినిమా ప్రమోషన్లలో మీడియాతో మాట్లాడిన శ్రీలీలా బ్రేకప్ అయిందా ? లేదా అనే ప్రశ్నకు స్పందించింది. తాను ఇప్పటివరకు లవ్ లో పడలేదని కాబట్టి బ్రేకప్ అనే ప్రశ్న తలెత్తదని ఆన్సర్ ఇచ్చింది.
ఇప్పటివరకు తాను ఎవరితోనూ ఎలాంటి బంధాలు పెట్టుకోలేదని చెప్పిన ఈ బిజీ హీరోయిన్ ప్రేమలో పడాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమ అనే దశను ఎంజాయ్ చేయాలని.. అలాంటి దశను తాను కూడా చూడాలని అనుకుంటున్నట్టు వెల్లడించింది.
అయితే ప్రేమలో పడి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే సమయం ఇప్పుడు తనకు లేదని తేల్చేసింది. శ్రీలీల ప్రేమలో పడాలని కోరుకుంటున్నట్టు చెప్పడంతో ఆమె నిజంగానే ప్రేమలో ఉందా ? ఆ ప్రియుడు ఎవరు ? ఆ పేరు చెప్పేందుకు ఇప్పుడు ఇష్టపడడం లేదా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
వాస్తవంగా చూస్తే శ్రీలీల ఇప్పుడు నిజంగా ప్రేమలో పడేంత తీరికతో అయితే లేదు. టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ శ్రీలీల. అసలు ఆమె నిద్రపోవడానికి టైం లేదు. ఇక ప్రేమలో ఏం పడుతుంది? శ్రీలీల ప్రేమలో పడే కోరిక తీరకటానికి మరి కాస్త టైం పట్టేలా ఉంది.