News' స్కంద ' ప్రీమియ‌ర్ షో టాక్‌... బాబోయ్ బోయ‌పాటి.. కోసి...

‘ స్కంద ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… బాబోయ్ బోయ‌పాటి.. కోసి ప‌డేశాడు..!

అఖండ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా స్కంద – ది ఎటాక్. రామ్ పోతినేని – క్రేజీ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు.. పాటలు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బోయపాటి స్టైల్ లో మాస్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని తీసినట్టుగా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

ప్రీమియర్ షో టాక్ ప్రకారం స్కంద సినిమా ఎలా ఉందో నేటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఓవర్సీస్ లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ ఈ స్కంద టీం మాత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది.

ఇక సినిమా చూసిన వారి కామెంట్స్ ప్రకారం స్కంధ‌ కథాబలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడ‌ని చెబుతున్నారు. సినిమా ఎక్కువగా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని.. బోయపాటి తనదైన స్టైల్ లో చెడుగుడు ఆడేసాడని అంటున్నారు. రామ్ ఫైట్స్ తో పాటు.. ఎలివేషన్ థ‌మ‌న్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయిందని సమాచారం.

సినిమాలో ఏపీ, తెలంగాణ సీఎంలు.. వారి మ‌ధ్య ఇగోలు, ప్ర‌శాంత్ కిషోర్‌పై సెటైర్లు, రామ్ – శ్రీలీల మ‌ధ్య వ‌చ్చే సీన్లు, అదిరిపోయే యాక్ష‌న్‌, టెక్నిక‌ల్‌గా బాగుండ‌డం ఇవ‌న్నీ చాలా బాగున్నాయ‌ట‌. ఫస్ట్ అఫ్ కొంతమేర యావరేజ్ గా ఉన్న సెకండ్ హాఫ్ అదిరిపోయింది అని.. ఓవరాల్గా సినిమా బాగుందని చెబుతున్నారు. రామ్ అభిమానులకు థియేటర్లలో అయితే పూనకాలు గ్యారెంటీగా వచ్చేస్తాయంటున్నారు. ఇక స్కంద సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో పాటు పార్ట్ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news