News' స్కంద ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. రామ్ - శ్రీలీల...

‘ స్కంద ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. రామ్ – శ్రీలీల టార్గెట్ కొండ మీద ఉందే..!

ఉస్తాద్ రామ్ పోతినేని – శ్రీలీల జంట‌గా మాస్ సినిమాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా స్కంద‌. బాల‌య్య‌తో అఖండ లాంటి ఊర‌మాస్ హిట్ తెర‌కెక్కించిన త‌ర్వాత బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంద సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. బోయ‌పాటి సినిమా అంటేనే భారీ హంగామా ఉంటుంది.

స్కంద‌లో కూడా అదే రేంజ్‌లో హంగామా ఉంది. శ్రీలీల‌, సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తే.. శ్రీకాంత్‌, ప్రిన్స్ సిసిల్‌, గౌత‌మి, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఇటు రామ్‌కు ఇస్మార్ట్ శంక‌ర్‌తో కాస్త మార్కెట్ పెర‌గ‌గా… బోయ‌పాటి నుంచి అఖండ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఏకంగా రు. 41 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అన్ని ఏరియాల నుంచి బ‌య్య‌ర్లు భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చారంటేనే ఈ సినిమా మీద ట్రేడ్‌లో ఎంత‌లా న‌మ్మ‌కం ఉందో తెలుస్తోంది. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాకు రు. 2.2 కోట్ల బిజినెస్ చేశారు. స్కంద థియేట్రిక‌ల్ రైట్స్ 46.02 కోట్లు కాగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రు. 47 కోట్ల షేర్ రాబ‌ట్టాలి.

ఏరియాల వారీగా చూస్తే
నైజాం – 13 కోట్లు
సీడెడ్ – 8.50 కోట్లు

ఆంధ్రా – 19.50 కోట్లు

ఏపీ + తెలంగాణ = 41 కోట్లు

క‌ర్నాట‌క + రెస్టాఫ్ – 3 కోట్లు

ఓవ‌ర్సీస్ – 2.20 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ – 46.20 కోట్లు

బ్రేక్ ఈవెన్ టార్గెట్ – 47 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news