News' స‌లార్ ' కొత్త రిలీజ్ డేట్‌.... మార్చ‌క‌పోతే గ‌ట్టి దెబ్బ...

‘ స‌లార్ ‘ కొత్త రిలీజ్ డేట్‌…. మార్చ‌క‌పోతే గ‌ట్టి దెబ్బ గ్యారెంటీ…!

సలార్ సినిమా ముందు చెప్పిన లెక్క ప్రకారం సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న టాప్ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ డిసెంబర్ 22 రిలీజ్ డేట్ అంటూ ఫిక్స్ అవ్వాలని నిర్మాతల నుంచి సమాచారం వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ డేట్ కు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? అంటే సందేహంగానే కనిపిస్తోంది.

అదే రోజు షారుక్ ఖాన్ డుమ్కీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. దీనివల్ల సలార్‌కు బాలీవుడ్ లో చాలా గట్టి ఎఫెక్ట్ పడుతుంది అనటంలో సందేహం లేదు. బాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు షారుక్‌ఖాన్ టైం నడుస్తోంది. ఒక‌ప్ప‌టి షారుక్ వేరు.. ఇప్ప‌టి షారుక్ వేరు. ఈ ఒక్క యేడాదిలోనే ఏకంగా ప‌ఠాన్ – జ‌వాన్ రెండు సినిమాల‌తో రెండుసార్లు వెయ్యి కోట్లు కొట్టాడు షారుక్‌.

అందువల్ల సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇంకా అనుమానాలు చాలానే ఉన్నాయి. ఈ డేట్‌కు రిలీజ్ అంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కచ్చితంగా ఒప్పుకోరు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి వాయిదా వేయడంతో ముందుగా చెప్పిన అమౌంట్ కంటే తక్కువ ఇస్తామని బ‌య్య‌ర్లు పెండింగ్ పెడుతున్నారు. ఇప్పుడు షారుక్ సినిమాకు పోటీగా రిలీజ్ అంటే కచ్చితంగా వారు ఒప్పుకోరు.

పైగా థియేటర్లు కూడా షారుక్ సినిమాతో సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల సలహా సినిమాపై గట్టి ఎఫెక్ట్ పడుతుంది. ఓపెనింగ్స్ కూడా సినిమా రేంజ్ కు క్రేజ్‌కు తగ్గట్టుగా రావన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో సలార్ వచ్చే సమ్మ‌ర్‌కు వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని అంటున్నారు.

అయితే సమ్మర్లో నాని, ఎన్టీఆర్‌, వెంకటేష్, నితిన్ పవన్ సినిమాలు లైన్లో ఉన్నాయి. అవన్నీ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం. ఏది ఏమైనా స‌లార్ రిలీజ్ విషయంలో ఎప్పుడైతే నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నారో అప్పటినుంచి క్రేజ్ తగ్గుతూ వస్తున్న మాట వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news