ప్రస్తుతం ఇండియన్ సినిమా తెరమీద తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. త్రిపుల్ ఆర్ – పుష్ప లాంటి సినిమాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఇటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అటు అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు సినిమాలపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీగా మారాయి. ఈ రెండు సినిమాలు తాను ఇప్పటివరకు చూడలేదని అంటూనే.. ఈ రెండు సినిమాలపై నెగిటివ్గా కామెంట్లు చేయడంతో ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి.
నసీరుద్దీన్ మాట్లాడుతూ ఇటీవల వస్తున్న సినిమాల్లో హీరోయిజం ఎక్కువగా చూపిస్తున్నారు.. అమెరికాలో మార్వలెస్ వారి సినిమాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయంటూ ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతలో కూడా కనిపిస్తుందని ఆర్ఆర్ఆర్ – పుష్ప సినిమాలు ఇప్పటివరకు చూడలేదని.. ఈ సినిమాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలు చూసిన ప్రేక్షకులు కూడా త్రిల్ ఫీల్ అవుతున్నారని.. తాను మణిరత్నం తలకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా చూసానని.. ఆయన గొప్ప దర్శకుడు అంటూ కొనియాడారు.
ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని తెలిపారు. అయితే నేటిజెన్ల చర్చ ప్రకారం ఆర్.ఆర్.ఆర్ – పుష్ప సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని నసీరుద్దీన్ షా ఎలా సర్టిఫై చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోవాలంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన విషయం ఆయన మర్చిపోయారా ? అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడుతూ తెలుగు సినిమాలపై అక్కసు వెళ్లగక్కడం సరికాదని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు.