Movies"తెలుగు హీరోలు అందరూ ఆ టైపే".. హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

“తెలుగు హీరోలు అందరూ ఆ టైపే”.. హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ హీరోయిన్స్ కి నోటి దూల ఎక్కువైపోయింది అంటున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ స్టేటస్ అందుకొని బాలీవుడ్ లోకి వెళ్ళాక తెలుగు ఇండస్ట్రీపై ఘాటుగా స్పందించడం చాలా అలవాటుగా మారిపోయిందని.. అలాంటి హీరోయిన్స్ ని బ్యాన్ చేసేయాలని చెప్పుకొస్తున్నారు. అయితే రీసెంట్గా హీరోయిన్ తమన్నా బాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది .

నిజానికి తమన్న బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా అడుగుపెట్టినా.. ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు . తెలుగులో శ్రీ అనే సినిమా ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా అవకాశాలు అందుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారింది. తమన్నా ఇంతటి క్రేజీ లైఫ్ స్టైల్ అందుకోవడానికి కారణం తెలుగు సినిమాలు అని మర్చిపోకూడదు . అయితే తమన్నా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”సౌత్ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలను కొన్ని వదులుకుంటున్నానని ” చెప్పుకు వచ్చింది .

దానికి రీజన్ ఏంటి అని హోస్స్ట్ ప్రశ్నించగా .. “అక్కడ పురుష ఆదిపత్యాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు ..మహిళలను తొక్కేస్తారు” అన్న విధంగా కామెంట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసిందని .. క్రేజ్ సంపాదించుకుంది అని.. మరి ఇలాంటి ఇండస్ట్రీపై బాలీవుడ్ మీడియాలో ఆమె అలా మాట్లాడటం సమంజసమేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తమన్నాను.. ఇండస్ట్రీ నుంచి బ్యాండ్ చేసేయాలని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్నా పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news