పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నటిస్తున్న సినిమాలలో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల – సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ గా సీనియర్ నటుడు కనిపించబోతున్నారు.. ఆ నటుడు ఎవరో కాదు కోలీవుడ్ సీనియర్ యాక్టర్ అయిన పార్టీబన్.
ఈ సినిమాలో పార్తీబన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని.. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా పవన్ – పార్తిబన్ పాత్రలు హరిశంకర్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. పార్తిబన్ ఎవరో కాదు కోలీవుడ్‌లో సీనియర్ యాక్టర్, దర్శకుడు కూడా..!
గతంలో తెలుగు సినిమాలలో నటించిన సీతకు మాజీ భర్త కావడం విశేషం. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ – నవీన్ ఎర్నేని ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలోకి రానుంది.