Newsమ‌హేష్‌బాబు ' మురారి ' సినిమా టైంలో డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీతో అంత...

మ‌హేష్‌బాబు ‘ మురారి ‘ సినిమా టైంలో డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీతో అంత గొడ‌వ జ‌రిగిందా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది క్రియేటివ్ డైరెక్టర్లలో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. కృష్ణవంశీ ముందు నుంచి వైవిధ్యమైన సినిమాలు తీసే డైరెక్టర్.. ఆయన తీసిన సినిమాలు అన్ని ఇటు కమర్షియల్ గాను.. అటు సందేశంతో కూడి ఉంటాయి. అయితే గత కొన్నేళ్ళుగా కృష్ణవంశీ తన రేంజ్ కు తగిన హిట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణవంశీ పూర్తిగా ఫామ్ లో లేరు. ఆయన తాజాగా తీసిన రంగమార్తాండ సినిమా కూడా అతిపెద్ద డిజాస్టర్ అయింది.

ఇక కృష్ణవంశీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన సినిమా మురారి. బాలీవుడ్ భామ సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. కృష్ణతో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు ఈ సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా నిర్మాతలకు.. దర్శకుడు కృష్ణవంశీకి మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ సినిమా మొత్తం రన్ టైం 200 నిమిషాల పాటు వచ్చింది.. అంటే సినిమా మూడు గంటలు దాటేశాక కూడా మరో 20 నిమిషాల పాటు ఉంటుంది.

అసలు థియేటర్లలో రోజుకు నాలుగు షోలు వేయటం చాలా కష్టమైపోతుందని.. సినిమా రన్ టైం 30 నిమిషాల పాటు తగ్గించేయాలని నిర్మాతలు కృష్ణవంశీపై ఎంతో ఒత్తిడి చేశారు. అయితే ఆయన మాత్రం సినిమా కట్ చేస్తే దర్శకుడుగా తన పేరు వేయవద్దని నిర్మాతలకు కండిషన్ పెట్టారు. ఇలా సినిమా రిలీజ్ కి ముందు పెద్ద యుద్ధాలు జరిగాయి.

ఇక రిలీజ్ రోజు సినిమా కట్ చేయకుండా మొత్తం రిలీజ్ చేశారు. అయితే నాలుగైదు రోజులకు వచ్చేసరికి సినిమా రన్ టైం ఎక్కువగా ఉందంటూ నెగిటివ్ టాక్ మొదలైంది. అంతసేపు సినిమా చూడలేకపోతున్నామని.. సాగదీతగా ఉందన్న కంప్లైంట్లు ప్రేక్షకుల నుంచి వచ్చేసాయి. వెంటనే నిర్మాతలు కృష్ణవంశీకి చెప్పకుండానే కొన్ని సీన్లు ట్రిమ్ చేసేసారు. అప్పుడు కృష్ణవంశీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత మురారి మెల్లమెల్లగా పికప్ అయ్యి మంచి హిట్ సినిమాగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news