Newsబాల‌య్య ' లెజెండ్‌ ' కు ప్ర‌భాస్ ' స‌లార్‌ '...

బాల‌య్య ‘ లెజెండ్‌ ‘ కు ప్ర‌భాస్ ‘ స‌లార్‌ ‘ కు ఆ లింక్ ఉందా… థియేట‌ర్లు షేక్..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లెజెండ్. ఈ సినిమాతోనే సీనియర్ నటుడు జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ చాలా గ్రాండ్ గా ఆరంభమైంది. ఈ సినిమాలో జగపతిబాబు పూర్తిస్థాయి విల‌న్‌గా నటించి బాలయ్యతో ఢీ అంటే ఢీ అనే పవర్ఫుల్ విలన్ గా నటించారు. ఆ తర్వాత జగపతిబాబు విలన్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో సరికొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు.

ఆ సినిమా నుంచి జగపతిబాబు విల‌న్‌గా వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా సలార్‌లోను జగపతిబాబు పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్స్ లోనే స‌లార్ సినిమాలోని రాజమన్నార్ పాత్ర‌ ఒకటిగా నిలిచిపోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు.

రాజ‌మ‌న్నార్ పాత్ర‌ను డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌ ఎంతో అద్భుతంగా రాసుకున్నారని… రాజమన్నార్ పాత్ర‌ ఎలా ? ఉంటుందో అనేది రేపు స్క్రీన్‌పై ఆడియెన్స్‌ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నటుడుగా తనకు ఎంతో మంచి పేరు తెస్తుంది అన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓవరాల్ గా లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలన్ గా ఎలా ? నట విశ్వరూపం చూపించారో ఇప్పుడు సలార్‌లో రాజమన్నార్‌గా అంతే విశ్వరూపం చూపించబోతున్నారు అన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.

ఇక సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసిన సలార్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 22 లేదా వచ్చే మార్చి నెల‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news