Moviesపెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం… మ‌రో వ్య‌క్తితో ర‌మ్య‌కృష్ణ‌కు పెళ్లి… ఆమె జీవితంలో...

పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం… మ‌రో వ్య‌క్తితో ర‌మ్య‌కృష్ణ‌కు పెళ్లి… ఆమె జీవితంలో ఇన్ని ట్విస్టులా…!


భలే మిత్రులు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన సంకీర్తన సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ఆమె వరుస ప్లాపుల్లో నటించిన ఆ తర్వాత కె. రాఘ‌వేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు సినిమా సూపర్ హిట్ అవడంతో అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతోంది.

రమ్యకృష్ణ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి కాకముందే రమ్యకృష్ణ కృష్ణవంశీతో సహజీవనం చేసిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి. పెళ్లి కాకముందు నుంచి వారిద్దరు కలిసి ఉన్నారు. అయితే పెళ్లి కోసం కొన్ని రోజులు టైం తీసుకోవాలని.. మరిన్ని సినిమాలు చేయాలన్న కోరికతో ఎదురు చాలా ఏళ్లపాటు పెళ్ళికి దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే రమ్యకృష్ణ.. కృష్ణవంశీ సహజీవనం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న రమ్యకృష్ణ తల్లిదండ్రులు ఆమెపై సీరియస్ అయ్యారు. రమ్యకృష్ణను బలవంతంగా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రమ్యకృష్ణ మాత్రం తాను కృష్ణవంశీని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి చివరకు అతడి జీవితంలోకి భార్య‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక కృష్ణవంశీ రమ్యకృష్ణ మధ్య ఎన్నోసార్లు బేధాభిప్రాయాలు వచ్చినా.. ఎన్నోసార్లు దెబ్బలాడుకుని వేరువేరుగా ఉన్న ఆ వెంటనే మళ్ళీ కలిసిపోతూ ఉండేవారట. ఈ వయసులో కూడా రమ్యకృష్ణ ఒకరోజు కాల్ షీట్ కు ఏకంగా 10 లక్షలకు పైగా డిమాండ్ చేస్తుంది. దీంతో ఆమె క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news