టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నాయి. ముఖ్యంగా గులాబీతోపాటు నాగార్జున హీరోగా తెరకెక్కించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో కృష్ణవంశీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
అక్కడ నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో జాతీయ సమగ్రత భావంతో తెరకెక్కించిన సినిమా ఖడ్గం. ఈ సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా కొంతమందికి నచ్చలేదన్న చర్చలు కూడా అప్పట్లో నడిచాయి. ఖడ్గం సినిమా తెరకెక్కించినందుకు కృష్ణవంశీకు బెదిరింపులు కూడా వచ్చాయి.
ఈ సినిమాలో రవితేజ కి జోడి హీరోయిన్ సంగీత నటించింది. అప్పట్లో సినిమా రంగంలో ఛాన్సుల కోసం హీరోయిన్లను హీరోలు, దర్శకులు ఎలా ? వాడుకుంటున్నారు అన్న అంశాన్ని సంగీత పాత్ర ద్వారా కృష్ణవంశీ చక్కగా చూపించారు. అప్పట్లో ఇది సెన్సేషన్ అయింది.
అలా సినీ రంగంలో కృష్ణవంశీకి ఎదురైన అనుభవాల ఆధారంగా హీరోయిన్లను ఇండస్ట్రీ వాళ్ళు ఎలా ?వాడుకుంటున్నారు అన్నది చూపించేందుకు సంగీత పాత్రను చక్కగా వాడుకున్నారని.. ఆ పాత్రతో ఇండస్ట్రీలో తెరవెనక తతంగాలను బయటపెట్టారని అప్పట్లో ఆయనను అందరూ మెచ్చుకున్నారు.