Newsమెగా కుటుంబానికి దూరమైపోతున్న నిహారిక.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

మెగా కుటుంబానికి దూరమైపోతున్న నిహారిక.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ ఈ అమ్మడే. అయితే హీరోయిన్ గా నేహారిక నటించిన సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు చెప్పినట్లు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. నిహారిక,చైతన్య లకు 2020 డిసెంబర్ 9 న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వీరు ఎప్పటికప్పుడు తమ లైఫ్ లో జరిగే అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేవారు.

అయితే ఏం జరిగిందొ ఏమో తెలీదు కానీ పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఈ విషయాని నేహారిక స్వయంగా వెల్లడించింది. ఇక అప్పటినుండి సోషల్ మీడియా లో నేహారిక సింగల్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు తన అన్నలకు రాఖి కడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో ని కుడా అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా నేహారిక పెట్టిన ఒక పోస్ట్ అందరిలో అనుమానాలు రేకేతిస్తుంది. చైతన్య తో విడిపోయిన తరువాత బాడీ పై ఎక్కువగా శ్రద పెట్టిన నేహారిక జిమ్ లో గంటలు గంటలు కష్టపడుతుంది. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే నేహారిక జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలని షేర్ చేస్తూ ‘లాస్ట్ వర్కౌట్ ఇన్ హైదరాబాద్ ‘అంటూ రాసుకొచ్చింది.

ఆ పోస్ట్ చూసిన మెగా అభిమానులు నేహారిక హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతుందా అని బాధపడుతున్నారు. కొంతమందేమో విడాకుల తరువాత నేహారిక మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉండాలి అనుకుంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. విడుకుల కారణం గా నాగబాబు, నిహారిక తో మాట్లాడటం మానేశారు అందుకే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చాలా మంది గుసగుసలు ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news