Newsప్ర‌భాస్ హెల్త్ ఎలా ఉంది.. రాధేశ్యామ్ నుంచి ఆగ‌ని పుకార్లు...!

ప్ర‌భాస్ హెల్త్ ఎలా ఉంది.. రాధేశ్యామ్ నుంచి ఆగ‌ని పుకార్లు…!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్‌, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వ‌రుస‌గా భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా ప్ర‌భాస్ నుంచి స‌లార్ సినిమా లైన్లో ఉంది. ఆ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే క‌ల్కి సినిమా ఆ త‌ర్వాత మారుతి, సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ లైన‌ప్ ప్ర‌భాస్‌కు ఉంది. వీటిలో ముందుగా స‌లార్ సినిమా రిలీజ్ కానుంది.

వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ 28న స‌లార్ రిలీజ్ కావాల్సి ఉన్నా చివ‌ర్లో వాయిదా ప‌డింది. స‌లార్ డిసెంబ‌ర్ 22 రిలీజ్ అంటున్నా.. మార్చికి వాయిదా ప‌డే ఛాన్సులు కూడా ఉన్నాయంటున్నారు. ఇక స‌లార్ షూటింగ్ ఇప్ప‌టికే ప్ర‌భాస్ కంప్లీట్ చేసేశాడు. స‌లార్ షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే మోకాలి ఆప‌రేష‌న్ కోసం విదేశాల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా కంప్లీట్ అయ్యింద‌ని.. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ లేద‌ని.. అక్క‌డే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం న‌వంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌భాస్ కంప్లీట్ రెస్ట్‌లో ఉండి… ఆ త‌ర్వాత తిరిగి త‌న సినిమాల షూటింగ్‌లో పాల్గొంటార‌ని తెలుస్తోంది.

ఏదేమైనా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ టైం నుంచి ప్ర‌భాస్ హెల్త్ విష‌యంలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే వ‌స్తోంది. ప్ర‌భాస్ కూడా వ‌రుస పాన్ ఇండియా సినిమాల నేప‌థ్యంలో కాస్త ఫేస్‌లో ఆ గ్లో కూడా త‌గ్గిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news