Moviesపిల్లల ఫస్ట్ బర్త్ డే కోసం నయనతార చేసిన పనికి ఫ్యాన్స్...

పిల్లల ఫస్ట్ బర్త్ డే కోసం నయనతార చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. 9నెలలు మోసి కనకపోయిన అమ్మనే కదా..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అప్పుడప్పుడే పాపులారిటీ దక్కించుకున్న విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా వీళ్ల పెళ్లి తర్వాత ఎన్నో చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఫైనల్లీ ఆ చిక్కులను అధిగమించిన ఈ జంట సరోగసి ద్వారా పిల్లలను కనీ తల్లిదండ్రులయ్యారు .

అంతేకాదు వాళ్ళ పుట్టిన రోజు చాలా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు . నయనతార – విగ్నేష్ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వీరి మొదటి పుట్టినరోజు వేడుకలను మలేషియాలో చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు . అంతే కాదు పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంతో ఇష్టంగా టైం స్పెండ్ చేశారు . దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే వీళ్ళు తమ పిల్లల పుట్టిన రోజు కోసం స్పెషల్గా మలేషియాకు వెళ్లి మరి సెలబ్రేట్ చేసుకున్నారు .

అంతే కాదు పిల్లల కోసం పెద్దగా హడావిడి చేయని నయనతార పిల్లలు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆమె దాదాపు 100 అనాధ శరణాలయాలలో ఫుడ్ బట్టలు డొనేట్ చేయించిందట. వీటికి దాదాపు 60 – 70 లక్షల పైగానే ఖర్చు అయినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు నయనతార తన పిల్లల ప్రతి పుట్టినరోజుకు ఇదే పని చేయడానికి నిశ్చయించుకుందుట . ఇది చాలా మంచి నిర్ణయం అంటూ ఆమెను పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news