Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మిస్ శెట్టి .. ఇండస్ట్రీకి...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మిస్ శెట్టి .. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో ఫస్ట్ టైం ఇలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇప్పటికే 150 చిత్రాలకు పైగా నటించిన మెగాస్టార్ చిరంజీవి ..ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం అభిమానులకు డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది . కానీ ఆయన ఫ్రెండ్స్.. క్రేజ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . కాగా రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు .

ఈ సినిమా ఫుల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కబోతున్నట్లు రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చర్ ఆధారంగా తెలిసిపోతుంది . అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్గా ఇద్దరు బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా నటించబోతుంది అన్న వార్త తాజాగా వైరల్ గా మారింది . ఇప్పటివరకు అనుష్క ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.. చిరంజీవితో కూడా చిందులేసింది.

కానీ అది ఐటమ్ గర్ల్ గా.. హీరోయిన్ గా ఇప్పటివరకు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది. అనుష్క ఫర్ ద ఫస్ట్ టైం చిరంజీవితో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అనుష్క అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మొదటి హీరోయిన్ గా ఈ సినిమాలో సంయుక్త మీనన్ సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news