Newsఎట్ట‌కేల‌కు శ‌ర‌త్‌బాబు రెండో భార్య స్నేహ మ్యాట‌ర్‌లో క్లారిటీ... !

ఎట్ట‌కేల‌కు శ‌ర‌త్‌బాబు రెండో భార్య స్నేహ మ్యాట‌ర్‌లో క్లారిటీ… !

టాలీవుడ్ దివంగత అందాల నటుడు శరత్ బాబు సినిమా రంగంలో ఎంతో స్టార్ హీరోగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వయసులో తనకంటే పెద్దవారు అయిన రమాప్రభ‌తో పెళ్లి కొన్నేళ్లపాటు కాపురం చేశాక మనస్పర్ధల నేపథ్యంలో విడాకులు.. ఆ తర్వాత రెండో పెళ్లి చివరకు తనకంటే వయసులో చాలా చిన్నది అయిన‌ నమితతో కూడా ఆయన కలిసున్నారంటూ ఇలా రకరకాల వార్తలు ఆయన వ్యక్తిగత జీవితంపై వినిపించాయి.

ఇది ఇలా ఉంటే మలయాళీ అమ్మాయి అయినా స్నేహా నంబియార్‌ని శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇప్పటివరకు ఉన్న ప్రచారం. అసలు స్నేహా నంబియార్ ఎవరు ? ఆమె నిజంగానే శరత్ బాబు రెండో భార్య అన్నదానిపై కొంత క్లారిటీ వచ్చింది. స్నేహా నంబియార్ మలయాళీ అయినా.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులో..! ఆమె ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్ లో నటించారు.

ఆమెకు తమిళ భాషపై కూడా మంచిపట్టు ఉంది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆమె శరత్ బాబును రెండో పెళ్లి చేసుకున్నట్టు పుకార్లు వచ్చాయి. కొంతకాలానికి వీరు కూడా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు రెండో భార్య‌గా స్నేహా నంబియార్ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ. ఓ త‌మిళ ఛానల్ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ శరత్ బాబు రెండో భార్య స్నేహా నంబియార్ అని… కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని స్నేహ వాపొయింది.

ఈ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయని.. ఆయన మృతి చెందినప్పుడు కూడా శరత్ బాబు రెండో భార్యను కాకుండా రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు.. కానీ నేను ఆయన భార్యను కాదు అసలైన స్నేహ నంబియాయర్ నాకంటే పెద్దది.. ఆమె ప్రముఖునటుడు నంబియార్‌ గారి కూతురు.. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి శరత్ బాబు ఫోటో పక్కన నా ఫోటోలు పెట్టేవారు.. నా పేరు కేవలం స్నేహ మాత్రమే అని ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news