ఇది నిజంగా రష్మిక మందన్న అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . రష్మిక మందన్నా.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో నటించిన తర్వాత ఆమె క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది . ఇప్పుడు ఆమె ఏ సినిమా చేసిన సరే అభిమానులు అదే స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అయితే పుష్ప సినిమా తర్వాత పట్టుమంటూ ఒక హిట్ కూడా తన ఖాతాలో వేసుకో లేకపోయినా రష్మిక మందన్నా.. ఆఫర్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది .
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకున్న రష్మిక .. రీసెంట్గా తెలుగులో మరోసారి విజయ్ దేవరకొండ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తిన్నూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేశారు . అయితే ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిన కారణంగా .. ఈ సినిమా నుంచి తప్పుకుందట .
దీంతో సెకండ్ కూడా ఆలోచించని విజయ్ దేవరకొండ తన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నాను ఆ ప్లేస్ లోకి రీప్లేస్ చేశారు . దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎప్పటినుంచో రష్మిక విజయ్ కాంబో ని రిపీట్ అవ్వాలని చూస్తున్నామని ఫైనల్లీ అదే జరిగింది అని.. ఆ దేవుడు రాసి పెడితే అంతే .. అది జరిగి తీరుతుందని చెప్పుకొస్తున్నారు . దీంతో స్క్రీన్ పై మరోసారి వీళ్లు రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అంటూ హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు.