పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమాలలో ఒకటైన సలార్ రిలీజ్ వాయిదా పడటం ఇండియన్ సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అభిమానులు ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లారు. ఇటు పాన్ ఇండియా హీరో ప్రభాస్.. అటు కేజీఎఫ్ సినిమాలతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు.
ముందుగా సెప్టెంబర్ 28 రిలీజ్ అన్నారు.. ఇప్పుడు సడన్‌గా వాయిదా వేశారు. అయితే సలార్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ రోజు సలార్ రిలీజ్ అయితే చాలా ఎఫెక్ట్ పడిపోయింది. అదేరోజు షారుక్ ఖాన్ – డమ్కీ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ 2 కూడా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. దీంతో పలు ప్రాంతాలలో సలార్ కి థియేటర్ల కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే అటు షారుక్ డమ్మీకి, ఇటు అక్వామ్యాన్ 2 సినిమాలకు భారీగా థియేటర్లు కేటాయిస్తారు. అదే జరిగితే నార్త్ బెల్ట్ తో పాటు ఓవర్సీస్ లో అనుకున్న స్థాయిలో థియేటర్లు దక్కవు. అప్పుడు మూడు సినిమాలకు థియేటర్లు షేరింగ్ తప్పదు. వాస్తవంగా సలార్ నిర్మాతలు నార్త్ ఇండియా కలెక్షన్ల పై భారీగా అశలు పెట్టుకున్నారు.
పైగా షారుక్ ఈ యాడాది ఇప్పటికే రెండు వెయ్యి కోట్ల సినిమాలతో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్నారు. అలాంటి షారుక్ సినిమాకు పోటీగా వెళ్ళటం అంటే గట్టి ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా సలార్‌కు ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా తక్కువ ధియేటర్లలో రిలీజ్ అయితే కలెక్షన్లపై గట్టి ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నాయి. సలార్‌పై మంచి అంచనాలు ఉన్నా కష్టాలు తప్పట్లేదు.. ప్రభాస్ జాతకం బాగోలేదనడానికి ఇదే నిదర్శనమేమో..!