టాలీవుడ్లో ఈ వారం రెండు సినిమాలు గట్టిపోటీతో విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు ఇద్దరు పేరు ఉన్న దర్శకులు దర్శకత్వం వహించారు. స్కంద – పెదకాపు 1. స్కంద సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. బాలయ్యతో అఖండ లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమా తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇక వెంకటేష్ తో నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన సినిమా పెదకాపు 1.
స్కంద సినిమాకు నిర్మాత చిట్టూరు శ్రీను. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు మధ్య కొన్ని కామన్ లింకులు ఉన్నాయి. పెదకాపు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బోయపాటికి మిత్రుడు. బోయపాటితో జయ జానకి నాయక – అఖండ రెండు సినిమాలు తీసిన వ్యక్తి స్కంద సినిమాకు నిర్మాత. చిట్టూరు శ్రీను ఆయన కూడా బోయపాటికి బాగా దగ్గర.. ఇద్దరు కలిసి ఒకప్పుడు రూమ్మేట్స్.
ఇప్పుడు ఈ రెండు సినిమాల కోసం మరో పెద్ద బ్యానర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు దర్శకులు తమ తర్వాత సినిమాలు ఆ సంస్థతో చేయాల్సి ఉంది. అదే అల్లు అరవింద్ కు చెందిన గీతా బ్యానర్. బోయపాటి – అల్లు అరవింద్ కానీ లేదా శ్రీకాంత్ అడ్డాల – అల్లు అరవింద్ ఈ కాంబినేషన్ ది పెండింగ్ డ్యూ.
బోయపాటి కోసం అల్లు అరవింద్ తమిళ హీరో సూర్యను సెట్ చేసి ఉంచారు. అయితే ఈ సినిమా హిట్ అయితే వెంటనే ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్ళవచ్చు. ఒకవేళ స్కంద హిట్ కాకపోతే సూర్య బోయపాటితో చేసేందుకు ముందుకు వస్తారా అన్నది అనుమానం. శ్రీకాంత్ అడ్డాల కథ రెడీగా ఉంది.. అయితే పెదకాపు హిట్ అయితే తప్ప గీతా సంస్థ శ్రీకాంత్తో సినిమా చేసేందుకు ముందుకు రాదు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల హిట్ అయితే గీతా బ్యానర్ లోనే వీళ్ళ తర్వాత సినిమాలు ఉండే ఛాన్సులు ఉన్నాయి.