Moviesబిగ్ బ్రేకింగ్: గుంటూరు కారం నుండి తప్పుకున్న మరో హీరోయిన్.. సినిమాకి...

బిగ్ బ్రేకింగ్: గుంటూరు కారం నుండి తప్పుకున్న మరో హీరోయిన్.. సినిమాకి పెద్ద బొక్క తప్పదా..?

ఏంటో .. త్రివిక్రమ్ మహేష్ బాబు ఏ ముహూర్తాన ఈ సినిమాను స్టార్ట్ చేశారో తెలియదు కానీ.. సినిమాకి అన్ని అడ్డంకులే వస్తున్నాయి . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో ఇన్ని సినిమాలు తెరకెక్కిన ఇప్పుడు ఈ విధంగా బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వలేదు . కానీ వీళ్ళ గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఒకదాని తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది . మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం .

ఈ సినిమాలో మొదటిగా పూజా హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్గా శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. అయితే పూజా హెగ్డే కొన్ని కారణాలు చేత ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి పలువురు స్టార్ టెక్నీషియన్స్ కూడా తప్పుకున్నారు. రీజన్స్ ఏవైనా కానీ ఒక బడా ప్రాజెక్టు నుంచి వరుసగా ఇంతమంది తప్పుకుంటున్నారు అంటే అందులో ఏదో ఒక మైనస్ ఉండనే ఉంటుంది.

రీసెంట్గా ఈ సినిమాలో కాజల్ ఓ కీలక పాత్రలో సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తాజాగా కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది . కాజల్ కి కథ చెప్పినప్పుడు ఒక విధంగా చెప్పి ..షూట్ చేసే టైం కి వేరే విధంగా.. తనని ఓల్డ్ పాత్రలో ఆంటీ పాత్రలో చూపించాలని చూపిస్తున్నారట . అందుకే కాజల్ ఒక్కరోజు సినిమా షూట్ కి అటెండ్ అయ్యి .. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇది నిజంగా గుంటూరు కారం కు బిగ్ మైనస్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news