హాలీవుడ్ లో పాపులర్ అయిన మల్టీవర్స్ కల్చర్ ను సౌత్ సినిమాలోకి తీసుకువచ్చాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజు. ఒక సినిమాలో పాపులర్ అయిన హీరో పాత్రను లేదా విలన్ పాత్రను మరో సినిమాలో కూడా వాడుతూ అతడి పాత్రను ఆ సినిమాలో కలుపుతూ హైలెట్ చేయడం లోకేష్ కనగరాజ్ నుంచే పాపులర్ అయింది. ఇప్పుడు ఈ మల్టీవర్స్ లోకి బోయపాటి శ్రీను కూడా ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది.
తాజాగా రామ్ హీరోగా రిలీజ్ అయిన స్కంద సినిమా క్లైమాక్స్‌లో తాను చెప్పాల్సిన విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పేసాడు బోయపాటి. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు మొరాకో మాఫియాను టచ్ చేస్తూ తాను సీక్వెల్ చేయబోతున్నానని విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అందులో తన సినిమాలోని మరో పాత్రను అతడు ఎంట్రీ చేయించే అవకాశాలు కనబడుతున్నాయి.
స్కంద సీక్వెల్‌కు మొరాకో మాఫియాకు లింక్ పెడతాడు అన్న మాట. ఇదిలా ఉంటే సీక్వెల్ ట్రెండ్ లోకి బోయపాటి కూడా చేరినట్టు అయింది. ఇప్పటికే అఖండ 2 తీస్తానని ప్రకటించిన ఈ డైరెక్టర్ స్కంద సినిమా చివరలో ఏకంగా పార్ట్ టూ పాస్టర్ వదిలాడు. అఖండలో బలమైన కథ, కథనాలు ఉన్నాయి. ఆ సినిమాకు సీక్వెల్ ఉన్నా ప్రేక్షకులు చూస్తారు.
ఇక స్కందోల కథ, కథనాలు లేవు. కేవలం ఎలివేషన్లు, హీరో బిల్డప్పులతోనే లాక్కొచ్చేశాడు. మరి దీనికి సీక్వెల్ ఉంటే ప్రేక్షకులు ఎంత వరకు చూస్తారు అన్న ప్రశ్నలు కూడా బోయపాటికి వస్తున్నాయి.