సినిమా ఇండస్ట్రీలో అనసూయకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో పలు ఆఫర్స్ లో అందుకొని సూపర్ స్టార్ క్రేజీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది . తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలేసిన అనసూయ రీసెంట్గా సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది.
రీసెంట్గా పెద్దకాపు 1 సినిమాలో నటిస్తున్న అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త కులం పై సంచలన కామెంట్స్ చేసింది . “నేను కులమతాలు పెద్దగా పట్టించుకోనని.. నేను భరద్వాజతో తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నానని .. కానీ నాకు ఆయన కులం ఏంటి అనేది పెళ్లి పత్రిక అచ్చు చేస్తున్నప్పుడే తెలిసిందని ..లగ్నపత్రిక రాసేటప్పుడు కులం గోత్రం అడిగినప్పుడు.. అప్పుడు మాత్రమే నాకు తెలిసిందని.. అంతకుముందు నేను భరద్వాజ్ ఇలాంటి కులాలు మతాలు పెద్దగా పట్టించుకోమని చెప్పుకొచ్చింది “.
దీంతో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది . తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్న వీళ్ళ మధ్య క్యాస్ట్ గురించి మాటలు రాకపోవడం మరీ వింతగా ఉంది అంటూ కొందరు అంటుంటే .. అది అనసూయ మంచితనం అంటూ మరికొందరు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . చూద్దాం అనసూయ పెద్ద కాపు సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?