Moviesఅందాల న‌టి వాణిశ్రీకి ఆ పేరు ఎవ‌రు పెట్టారు.. దీని వెన‌క...

అందాల న‌టి వాణిశ్రీకి ఆ పేరు ఎవ‌రు పెట్టారు.. దీని వెన‌క ఇంత స్టోరీ ఉందా ?

టాలీవుడ్ లో రత్నకుమారి అని ఒక స్టార్ హీరోయిన్ ఉంది అని చెప్తే మనలో ఎవరైనా గుర్తు ప‌డతామా ? అస్సలు తెలియదు అంటాము. అయితే వాణిశ్రీ పేరు చెపితే నిన్నటి తరం సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె కళాభినేత్రిగా సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. మహానటి సావిత్రి తర్వాత అంత పేరు తెచ్చుకున్న నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు.

వాణిశ్రీ కేరీర్‌ ప్రారంభంలో చాలా చిన్నచిన్న పాత్రలలో నటించారు. ఆమె హీరోయిన్గా ఎదగటానికి కొంచెం టైం పట్టింది. ఆమె అసలు పేరు రత్నకుమారి. నెల్లూరులో పుట్టిన వాణిశ్రీ కుటుంబం మద్రాస్ కు మారడంతో ఆమె నాటకాలతో తన కెరీర్ మొదలుపెట్టారు. అప్పట్లో భారతదేశం మెచ్చిన నాటకాలలో ఆమె నటించారు. రక్త కన్నీరులో హీరోకి భార్యగా, చిల్లర కొట్టు చిట్టెమ్మ‌లో చిట్టెమ్మ పాత్రలు పోషించారు.

ఆమె హీరోయిన్గా నటించిన మొదటి సినిమా బంగారు పంజరం. అయితే వాణిశ్రీ కి ఆ పేరు పెట్టింది మాత్రం సీనియర్ నటుడు ఎస్వీ రంగారావు కావడం విశేషం. ఎస్విఆర్ బ్యానర్లో వాణిశ్రీ నటించారు. ఆయ‌న బ్యాన‌ర్‌ పేరు వాణి ఫిలిమ్స్. ఈ క్రమంలోనే తన బ్యానర్ పేరు అయిన వాణీ ఫిలింస్ పేరు జోడించి రత్నకుమారిని కాస్త వాణిశ్రీగా మార్చేశారు. అలా అప్పటినుంచి రత్నకుమారి వాణిశ్రీ గా పాపులర్ అయిపోయింది.

ఆమె తెలుగు తెరకు ఆ తరంలో లేడీస్ సూపర్ స్టార్ అని చెప్పటంలో ఎలాంటి అతియో శక్తి లేదు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు – వాణిశ్రీ కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకులకు పిచ్చ క్రేజీ. వీరి కాంబినేషన్లో దసరా బుల్లోడు, ప్రేమనగర్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో ఈ జంట ఒక్కసారిగా పాపులర్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news