టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరుపదులు వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ నేటి తరం హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కి చూపించిన చిరు. రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాతో మాత్రం మరోసారి తన అభిమానులకు గట్టి షాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో చిరు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతలో వేసుకున్నాడు.
ఇదే సమయంలో చిరంజీవి ఇలాంటి ఎన్నో సంఘటనలను తన కెరీర్ లో ఎన్నో ఎదుర్కొన్నాడు మరీ ముఖ్యంగా.. 1995లో వచ్చిన అల్లుడా మజాకా సినిమా తర్వాత చిరంజీవికి టైం అసలు కలిసి రాలేదు.. ఈ సినిమా తర్వాత వచ్చిన బిగ్ బాస్, రిక్షావోడు, ఇద్దరు మిత్రులు, సిపాయి, డాడీ ఇలా వరుసగా ప్లాప్ సినిమాలు వచ్చాయి. మధ్యలో హిట్లర్, మాస్టర్, అన్నయ్య ,బావ గారు బాగున్నారా వంటి సినిమాలు విజయం సాధించిన అవి మెగాస్టార్ స్టామినాను బాక్సాఫీస్ కి చూపించలేకపోయాయి.
ఆ తర్వాత మృగరాజు ప్లాప్ తర్వాత చిరంజీవి పని అయిపోయిందన్న విమర్శలు గట్టిగా వినిపించాయి.
అలాంటి సమయంలోనే ఆయన్ను మళ్లీ బాక్సాఫీస్‌కు మొగుడుగా నిలబెట్టిన సినిమా ఇంద్ర.. చిరు కెరియర్ లోనే మైల్ స్టోన్ సినిమాలలో ఇది కూడా ఒకటి.. మాస్ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవికి జంటగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లు నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయం అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇక ఈ సినిమాకు ముందు చిరంజీవి తనకు ఫ్యాక్షన్ సినిమాలు సూట్ కావని ఇంద్ర సినిమాను వదులుకున్నారట. దర్శకుడు బి గోపాల్ మాత్రం ఈ కథకు మీరే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని చిరంజీవికి ఎంతగానో చెప్పి ఒప్పించారట. అలా ఇంద్ర సినిమా ప్రేక్షకులముందుకు వచ్చి చిరంజీవి కెరీర్ కు మళ్లీ ఊపును ఇచ్చింది. ఇంద్ర సినిమా లేకుండా ఉంటే చిరంజీవి ఈ సమయానికి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ఉండేవాడిని కూడా కొందరు అంటూ ఉంటారు.