Moviesఅల్లు అర్జున్ కి జాతియ అవార్డ్ రావడానికి కారణం తనేనా..? ఫ్యాన్స్...

అల్లు అర్జున్ కి జాతియ అవార్డ్ రావడానికి కారణం తనేనా..? ఫ్యాన్స్ ఒళ్లు మండిపోతుందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడానికి కారణం మెగా మనవరాలు క్లీం కార అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మనకు తెలిసిందే రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం మెగా ఫ్యామిలీలో జరుగుతున్న శుభకార్యాలు అన్నిటికీ కారణం మనవరాలు అంటూ ఎమోషనల్ గా స్పందించారు. చాలా సంబరపడిపోయారు.

అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది . ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఎవరు అందుకొని ఘనతను అందుకున్నాడు బన్నీ . ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఈ క్రెడిట్ మొత్తం మెగా ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నారు. క్లీం కార కారణంగానే అల్లు అర్జున్ కు అవార్డు వచ్చిందని ఆమె రాకతోనే అల్లు అర్జున్ ఇంతటి స్థానాన్ని అందుకోగలిగాడు అని ట్రెండ్ చేస్తున్నారు.

మరికొందరు అల్లు అయాన్ కి క్లీంకార కి పెళ్లి చేస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అదే కామెంట్స్ ని ట్రెండ్ చేస్తూ నిజంగానే క్లిం కార మెగా ఫ్యామిలీకి చాలా లక్కీ అని ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి కూడా లక్కీగా మారిపోతుందని పరిస్థితులన్నీ చక్కగా జరిగితే అల్లు అయాన్..క్లీం కార పెళ్లి జరుగుతుంది అని అప్పుడు అల్లు ఫ్యామిలి కి కూడా క్లింకార లక్ ని తీసుకొచ్చినట్లే అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఎంతో కష్టపడి దక్కించుకున్న క్రేజీ మొత్తం మెగా ఫ్యాన్స్ తీసుకెళ్లి క్లింకార ఖాతాలో వేసేసారు . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమదైన స్టైల్ స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news