Moviesఆ సంబంధాల‌పై క్లారిటీ ఇచ్చిన స‌మంత‌…!

ఆ సంబంధాల‌పై క్లారిటీ ఇచ్చిన స‌మంత‌…!

హీరోయిన్ సమంత అనారోగ్య కారణాలతో సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా రిలీజ్ గా ఉంది. తాజాగా ఈ హీరోయిన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం న్యూయార్క్ వెళ్ళిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి దానికి మానవ సంబంధాలపై క్యాప్షన్ రాసుకు వచ్చింది.

ఈ భూమి మీద ఉన్న జీవులు అన్నింటికి సంబంధం ఉంది. మన చేతులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. మన కణాలు పైనాపిల్ కణాల్లా ఉంటాయి.. మన డిఎన్ఎకు పుట్టగొడుగులతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితో మరొకరికి సంబంధం ఉంటుంది.. కాకపోతే కొంచెం దగ్గరగా లేదా దూరంగా అంతే..!

అందరం ఒకే క‌ణం నుంచి వచ్చిన వాళ్ళమే అని సమంత కాస్త ఎమోషనల్ గా వచ్చింది. మాన‌వ‌ సంబంధాలపై సమంత ఎమోషనల్ గా చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news