Moviesఎన్టీఆర్ - రేలంగి, సావిత్రి - గిరిజ మ‌ధ్య చిచ్చు పెట్టిన...

ఎన్టీఆర్ – రేలంగి, సావిత్రి – గిరిజ మ‌ధ్య చిచ్చు పెట్టిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇదే..!

అప్పుచేసి ప‌ప్పు కూడు సినిమా తెలుగు సినీ రంగంలో ఒక విప్ల‌వం తీసుకువ‌చ్చింది. అప్ప‌టి స‌మాజ పోక‌డ‌ల‌ను తెర‌పై చూపించారు. అప్పు చేసి.. దుబారా చేయ‌డంతోపాటు.. అప్పులు చేసి దాత‌లుగా పేరు తెచ్చుకునే వారికి చుర‌క‌లు అంటించే ఈ సినిమా క‌థ అంద‌రికీ ఎంతో న‌చ్చింది. మ‌హాన‌టులు చాలా మంది ఈ సినిమాలో న‌టించారు. రేలంగి, గిరిజ‌, సావిత్రి, అన్న‌గారు.. ఎన్టీఆర్‌.. సీఎస్ ఆర్‌.. వంటి ఎంతో మంది న‌టించారు. సినిమా దాదాపు 3.20 నిమిషాల సేపు ఉంటుంది.

తొలి పేర్లు ప‌డ‌డం నుంచి మొత్తం 9 పాట‌లు చిత్రీక‌రించారు. ఆ రోజుల్లో కాబ‌ట్టి సెన్సార్ వారు ఎక్క‌డా అభ్యంత‌రం చెప్ప‌లేదు. నిజానికి 2.30 గంట‌లు దాటేందుకు సెన్సార్ ఒప్పుకోదు. ఇప్పుడు దీనిని 2.20 గంట‌ల‌కే త‌గ్గించారు. స‌రే.. క‌థ‌లో బ‌లం ఉంది కాబ‌ట్టి.. వినూత్నంగా ఉంది కాబ‌ట్టి.. ఓకే చెప్పారు. సినిమా టైమింగ్స్ కూడా మార్చేసి మ‌రీ.. ఈ సినిమాను ప్లే చేశారు.

ఉద‌యం స‌హ‌జంగా 11 గంట‌కు ప్రారంభ‌య్యే సినిమాలు.. ఈ సినిమాతో ఉద‌యం 10 గంట‌ల‌కే ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌తి షోను గంట ముందుకు జ‌రిపారు. సినిమా పాట‌లు కూడా పూర్తిగా హిట్ట‌య్యాయి. అయితే.. ఈ సినిమా హిట్ట‌యినా.. న‌టుల మ‌ధ్య మాత్రం వివాదం చోటు చేసుకుంది. ముక్కామ‌ల‌, సీఎస్ ఆర్‌, ఎన్టీఆర్‌-రేలంగి, సావిత్రి-గిరిజ‌ల మ‌ధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి కార‌ణం.. ఈ సినిమా పాత్ర‌ల్లో త‌మ‌కు మాత్ర‌మే గుర్తింపు వ‌చ్చింద‌ని ఎవ‌రికివారే చెప్పుకొచ్చారు.

ఇక‌, సినిమా క‌థ అంతా కూడా.. సీఎస్ ఆర్ చుట్టూ తిరుగుతుంది. దీంతో ఆయ‌న నేను లేక‌పోతే..సినిమానే లేదు.. అనే శారు. ఇది మ‌రింత వివాదంగా మారింది. దీంతో చాలా రోజులువీరు ఎదురు ప‌డ‌లేద‌ట‌. చివ‌ర‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా జోక్యం చేసుకున్న ముక్కామ‌ల‌.. వివాదం ఎందుకు అంద‌రూ క‌లిసి న‌టిస్తేనే సినిమా పూర్త‌యింది. అన్నారు. మ‌రోవైపు.. నిర్మాత మాత్రం నేను అప్పుల్లో మునిగాను.. అని తెల్లారి ప్ర‌క‌టించే స‌రికి అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news