శ్రీవిద్య మలయాళీ అమ్మాయి అయినా అచ్చ తెలుగు హీరోయిన్గా మన తెలుగింటి ఆడపడుచు గా తెలుగులో ఎన్నో పాత్రలలో నటించింది. అయితే ఆమె జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మలయాళీ అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్‌తో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇంట్లో వాళ్ళు వద్దని ఆమె వారించారు. నీకు ఇంకా పరిపక్వత లేదని చెప్పారు.. అయినా కూడా ఆమె ఇంట్లో వాళ్ళ మాట పక్కన పెట్టేసి జార్జిను గుడ్డిగా నమ్మి అతడిని పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి జరిగిన తర్వాత మనస్పర్ధలు రావడంతో 1980 లోనే జార్జి నుంచి విడిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చాక ఆమె నడిరోడ్డు మీద నిలబడిపోయింది. ఏం చేయాలో ? ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే శ్రీవిద్య తల్లి ఎంఎల్ వసంతకుమారి అండగా ఉండడంతో ఏవీఎం సంస్థ బ్యానర్లో ఒక సినిమాకు అగ్రిమెంట్ చేసింది. అలా ఆమె జీవితం తిరిగి కొత్తగా ప్రారంభమైంది.
విచిత్రం ఏంటంటే ఆమె లోకనాయకుడు కమల్‌హాసన్‌ను ప్రేమించింది. అతడిని పూర్తిగా నమ్మేసింది. కమల్ తనను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే అతడు ద్రోహం చేశాడని ఫీల్ అయ్యింది. కమల్ శ్రీ విద్యను కాదని తర్వాత చాలా చాలా పెళ్లిళ్లు, వ్యవహారాలు నడిపాడు. ఇక శ్రీ విద్య 2006లో బోన్ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె చనిపోవడానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఏ వ్యక్తిని అయితే వివాహం చేసుకోవాలని అనుకున్నానో… అతడే స్వయంగా పిలిచి తన సినిమాలో అతడికి అమ్మ పాత్ర వేయమనడంతో వేశానని చెప్పింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని.. ఇలాంటి క్షమించే గుణం నీకు ఎలా వచ్చిందని ఎవరైనా అడిగితే అది దైవానుగ్రహం అని చెపుతా అని శ్రీ విద్య చెప్పింది. ఏదేమైనా నాకు పెళ్లికి ముందున్న జీవితమే ఎంతో బాగుందని కూడా శ్రీ విద్య చెప్పుకొచ్చింది.