సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం ఎంత కష్టమైనా విషయమో మనందరికీ బాగా తెలిసిందే. అందుకే ఇలాంటి తలనొప్పులు పడాల్సి వస్తుంది అని తమ బిడ్డల్ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రానివ్వరు కొందరు తల్లిదండ్రులు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం తల్లిదండ్రులను ఎదిరించి మరి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కష్టమో నష్టమో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే అంటూ రీసెంట్గా వార్తలు వైరల్ అవుతున్నాయి .
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తరువాత తనదైన స్టైల్ లో దూసుకుపోయిన కాజల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది. అయితే కెరియర్ పై ఉన్న ప్యాషన్ తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ కు డైరెక్టర్స్ నుంచి చేదు అనుభవమే ఎదురయింది.
కొందరు డైరెక్టర్స్ పెళ్లి అయిపోయి బిడ్డ ఉన్న నువ్వు హీరోయిన్ ఎలా అవుతావు అని ఇన్సల్ట్ చేస్తే.. మరో డైరెక్టర్ మాత్రం కాజల్ అందాలపై మోజు తీరక ఆమెను కమిట్మెంట్ అడిగారట . ఈ విషయం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ మొదటి నుంచి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో తెలిసిందే . అయితే అలా పెళ్లి అయి ఓ బిడ్డకు తండ్రి అయ్యాక.. కూడా కమిట్మెంట్ అడగడం ఆమె జీర్ణించుకోలేకపోయిందట . అందుకే ఆ డైరెక్టర్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి మరి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను సైతం వెనక్కి ఇచ్చేసిందట . అంత నిజాయితీగల అమ్మాయి కాజల్. దీంతో సోషల్ మీడియాలో కాజల్ ని ప్రశంసిస్తూ ఆ డైరెక్టర్ని బూతులు తిడుతున్నారుజనాలు. వావి వరసలు లేవరా ..? పెళ్లి అయిన ఆమెను కూడా కాస్టింగ్ బాధపడుతున్నారా నాశనం అయిపోతారు అంటున్నారు..!!