Moviesముచ్చటగా మూడోసారి.. రష్మిక క్రేజీ ఆఫర్ ని ఎగరేసుకునిపోయిన శ్రీలీల..!!

ముచ్చటగా మూడోసారి.. రష్మిక క్రేజీ ఆఫర్ ని ఎగరేసుకునిపోయిన శ్రీలీల..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా ఆఫర్స్ ను ఎగరేసుకునిపోయిందా.. అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇది మొదటిసారి కాదు ఇప్పటికే రెండుసార్లు ఇలా సినిమాల విషయంలో రష్మిక మందన ఆఫర్ ను ఎగరేసుకుపోయిన శ్రీలీల ముచ్చటగా మూడోసారి రష్మిక ఆఫర్ ని ఎగరేసుకుపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

మనకు తెలిసిందే వెంకి కుడుముల నితిన్ కాంబోలో వచ్చిన భీష్మ సినిమాల్లో రష్మిక హీరోయిన్గా నటించింది . మరోసారి అదే క్రేజీ కాంబోను రిపీట్ చేయడానికి ట్రై చేశాడు వెంకీ కుడుముల . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరోగా నితిన్ హీరోయిన్గా రష్మిక మందన్నా ని చూస్ చేసుకున్నారు అంటూ అనౌన్స్మెంట్ కూడా చేశారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో రష్మిక మందనాన్ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రష్మిక మందన్నా నే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు శ్రీలీల అందుకునింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం రష్మిక కెరియర్ పాతాళానికి శ్రీ లీల కెరియర్ ఇంకో స్టెప్ ఎక్కడానికి చాలా దగ్గరగా ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు. మొత్తానికి శ్రీలీల – నితిన్ సరసన మరో ఆఫర్ ను అందుకుంది . ఇప్పటికే వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు నితిన్ వెంకి దర్శకత్వంలోనూ శ్రీలీల హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news