తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియదు కానీ విజయ్ దేవరకొండ – సమంత తెలిసి తెలియక తనంతో చేసిన పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి పేరును ట్రోలింగ్కి గురి అయ్యేలా చేస్తుంది? అసలకి వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ ఖుషి సినిమా స్టార్టింగ్ నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ పాటలు ఆధారంగా వీళ్ల కెమిస్ట్రీ సూపర్ సక్సెస్ అయిందని నిజంగానే వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ జనాల సైతం గుసగుసలాడుకుంటున్నారు.
సరిగ్గా ఇలాంటి టైం లోనే ఖుషి ఈవెంట్ లో ఇద్దరు స్టేజిపై రెచ్చిపోయి పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరికీ ఏదో తేడాగా అనిపిస్తుంది . అంతేకాదు సమంత స్టేజిపై మాట్లాడుతూ..” విజయ్ దేవరకొండకు కాబోయే భార్యకు కావాల్సిన లక్షణాలు ఇవే ” అంటూ ఓపెన్ గా చెప్పేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఖుషి ఈవెంట్ లో విజయ్ దేవరకొండకు కాబోయే భార్య ఇలానే ఉండాలి అంటూ సమంత మాట్లాడుతూ..” విజయ్ చాలా సింప్లిసిటీ పర్సన్ .. ఎక్కువగా మేకప్ ఇష్టపడరు .. చాలా న్యాచురల్ గా ఉండాలి అనుకుంటాడు .. అంతే కాదు విజయ్ చాలా జెన్యూన్ ..ఎదుట అమ్మాయి కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు.. అంతేకాదు విజయ్ ఫోన్ చాలా తక్కువగా మాట్లాడుతాడు .. మెసేజెస్ ఎక్కువ చేస్తాడు.. గేమింగ్ యాప్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాడు.. మరి ముఖ్యంగా వచ్చే అమ్మాయి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి తన కుటుంబంలో ఒకరిగా ఉండిపోవాలి ..అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే ఇష్టపడతాడు” అంటూ చెప్పుకొచ్చింది .
అంతే కాదు విజయ్ సైతం..” సమంత చెప్పింది నిజమే నాకు అలాంటి క్వాలిటీస్ ఉన్నా అమ్మాయి కావాలి” అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ప్రేమాయణం జరుగుతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. రేపో మాపో పెళ్లి అంటూ కూడా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే రీసెంట్గా సమంత చెప్పిన క్వాలిటీస్ చూస్తే ఆ క్వాలిటీస్ రష్మిక మందన్నాలో అస్సలు లేవు . మరి అలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు..? విజయ్ అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఓ అమ్మాయిని చూసుకున్నాడని ..ఆ క్వాలిటీస్ అందుకే అంత పర్ఫెక్ట్ గా చెప్పగలిగింది సమంత అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ – రష్మిక – సమంతల పేర్లు మరోసారి వైరల్ గా మారాయి .