Moviesప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్‌… మ‌హేష్‌ను వ‌దిలేసిందా…!

ప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్‌… మ‌హేష్‌ను వ‌దిలేసిందా…!

మీరాచోప్రా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ జనాలకు ఆమె బాగా గుర్తుండిపోతుంది. ఆమె నటించిన వాన సినిమా మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ పక్కన బంగారం సినిమాలో నటించినా ఆ సినిమా ప్లాప్ కావడంతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలగాలన్న ఆమె కోరిక నెరవేరలేదు.

సినిమాలతో పాపులర్ కాకపోయినా సోషల్ మీడియా ద్వారా మీరా చోప్రా ఎప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉంటూ పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి మీ అభిమాన హీరో ఎవరు ? అని ప్రశ్నించగా ఇంకెవరు ప్రభాస్ అంటూ సమాధానం ఇచ్చింది.

గతంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు మహేష్ బాబు పేరు చెప్పిన ఈ పేడ్ అవుట్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పేరు చెప్పటం విశేషం. ప్ర‌భాస్‌పై మ‌న‌సుపారేసుకున్నానంటూ చెప్పింది. అలాగే గతంలో ఒకసారి తనకు ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అని చేసిన కామెంట్ కు ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనిపై అప్పట్లో నానా రచ్చ జరిగింది.

ఇక మీరా చోప్రా ఇటీవల రాజకీయాల గురించి కూడా కామెంట్ చేసింది. బిజెపికి మద్దతుగా మీరా చోప్రా చేసిన కామెంట్ సంచలనం రేపింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణం.. మత ఘర్షణలు కేవలం బిజెపి వల్ల జరుగుతున్నాయని కామెంట్ చేస్తూ ఉంటారు. మరి ప్రాన్స్ – లండన్ – ఇటలీ దేశాల్లోనూ బిజెపి ప్రభుత్వం ఉందా ? అని ఆమె చేసిన కామెంట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news