Moviesకొత్త ప్రేమ‌లో స‌మంత‌.. పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిందిగా…!

కొత్త ప్రేమ‌లో స‌మంత‌.. పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిందిగా…!

సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత కెరీర్ ఎప్పుడు ఏదో ? ఒక విషయాలతో వార్తల్లో ఉంటుంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అలాగే టాలీవుడ్ లో బలమైన కుటుంబానికి చెందిన హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య – సమంత పెళ్లి ఎంత సెన్సేషనల్ అయిందో.. వీరిద్దరు విడాకులు కూడా అంతే సెన్సేషనల్ అయ్యాయి.

విడాకుల తర్వాత సమంత మరింత హాట్ గా రెచ్చిపోతుంది. ఇక తాజాగా ఆమె విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె సినిమాలకు కొద్ది రోజులపాటు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఖుషి సినిమా ప్రమోషన్ల కోసం సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖుషి ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్ కు సమంత రాకపోయినా ఆడియో కార్యక్రమానికి వచ్చి ప్రమోషన్లలో హైలెట్ అయింది.

ఈ కార్యక్రమంలో సామ్ – విజయ్ కలిసి చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. దీనికి తోడు సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ క్రియేట్ అయింది. ప్రస్తుతం అమెరికా వెళుతున్న సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా వేదికగా కొత్త ప్రేమ అనే పదంతో ఒక పోస్ట్ పెట్టింది. అక్కడ ఒక గ్లాసులో వాటర్ ఉన్న ఫోటో షేర్ చేసింది. మెరిసే నీటి పట్ల తాను కొత్త ప్రేమను కనుగొన్నా అంటూ కొత్త అంశాలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అని మూడు లవ్ ఎమోజీలను పెట్టింది.

అంతేకాకుండా ఫోటోలతో పాటు.. ఆమె చేతికి లవ్ అనే అక్షరాలతో ఉన్న అందమైన బ్రాస్లెట్ కూడా ఉంది. ఈ పోస్ట్ పెట్టి చూస్తే ఆమె మ‌యోసైటిస్ నుంచి కోలుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా.. చాలా స్వేచ్ఛగా ఉన్నా.. స్వచ్ఛమైన నీరే నాకు ప్రేమ పంచుతుందన్న అర్థంలో కామెంట్ పెట్టిందని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం ఆ పోస్ట్ వెనక ఉన్న ప్రేమ ఏంటో ? అని ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news